హోదాపై తీవ్రంగా స్పందిస్తున్న పవన్ కళ్యాణ్ !


స్టార్ హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదాపై పూర్తిస్థాయిలో తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈరోజు హోదా సాధన కోసం వైజాగ్లోని ఆర్కే బీచ్ వద్ద యువత నిశ్శబ్ద నిరసనను చేపట్టింది. దీంతో ప్రభుత్వం కొందరు నిరసనకారులను, విద్యార్థులను అరెస్టు కూడా చేసింది. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా తీవ్ర స్థాయిలో స్పందించారు. పరోక్షంగా వార్నింగ్స్ కూడా ఇచ్చారు.

ముఖ్యంగా పోలీసులు అరెస్టు చేసిన కార్యకర్తలను, విద్యార్థులను వెంటనే విడిచిపెట్టాలని ప్రభుత్వాన్ని డిమాం చేశారు. అంతేగాక నిరసనను అవమానిస్తున్నారని, ఈ అవమానాన్ని యువతీ యువకులు గుర్తుపెట్టుకోవాలని అన్నారు. ఈ విషయంపై రేపు ఉదయం 9 నుండి 10 గంటల మధ్యలో ప్రెస్ మీట్ పెడతానని కూడా తెలిపారు. దీంతో అందరూ రేపటి ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.