వైరల్ : ఆఫ్ లైన్ లో ట్రెండ్ మార్చిన పవర్ స్టార్.!

Published on Sep 16, 2023 8:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన రీసెంట్ చిత్రం “బ్రో” తో అయితే మళ్ళీ తన వింటేజ్ స్టైలింగ్ ని నెక్స్ట్ లెవెల్లో తాను చూపించగా ఈ చిత్రం అనంతరం తాను ఇతర చిత్రాలతో బిజీగా మారాడు. అయితే ఇది వరకు ఆఫ్ లైన్ లో కంప్లీట్ వైట్ అండ్ వైట్ లో కనిపించే పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం బ్లాక్ అవుట్ ఫిట్స్ లో కనిపిస్తూ మెయిన్ అట్రాక్షన్ గా మారుతున్నారు.

మొన్న రీసెంట్ గా కూడా ఓ ముఖ్య మీటింగ్ నిమిత్తం వెళ్లిన పవన్ కళ్యాణ్ బాలయ్య లోకేష్ నడుమ బ్లాక్ షర్ట్ లో హైలైట్ కాగా ఇప్పుడు తాజాగా పవన్ మరోసారి మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ దుస్తులే ధరించి దర్శనం ఇచ్చాడు. దీనితో ఫ్యాన్స్ లో ఒక్కసారిగా ఈ పిక్స్ వైరల్ గా మారాయి.

అయితే ఇన్నాళ్లు పవన్ తన పొలిటికల్ పనులు విషయంలో పూర్తిగా తెల్లని బట్టలనే ప్రిఫర్ చేయగా ఆ మధ్య ఎప్పుడో ట్రెండీగా కూడా రావొద్దా అన్నట్టు మాట్లాడారు. మరి ఇప్పుడు అదే మాటపై దానికి కంప్లీట్ భిన్నంగా తయారై వస్తున్నారు. మరి దీని వెనుక ఉన్న సంకేతం ఏమిటో కానీ ఈ కొత్త లుక్ తో మాత్రం ఫ్యాన్స్ కి కిక్ ఇస్తున్న పవన్ లుక్స్ మాత్రం ఇపుడు మంచి వైరల్ గా మారిపోయాయి.

సంబంధిత సమాచారం :