ఐఈబిఎఫ్ ఎక్సెలెన్స్ అవార్డుకు ఎన్నికైన పవన్ కళ్యాణ్ !
Published on Sep 25, 2017 5:19 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండో యూరోపియన్ బిజినెస్ ఫోరమ్ (ఐఈబిఎఫ్) ఎక్సెలెన్స్ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈ 2017 సంవత్సరానికి గాను ఫోరమ్ ప్రతినిధులు పవన్ కళ్యాణ్ ను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు అధికారిక ప్రతినిధులు పవన్ ను కలిసి విషయాన్ని తెలియపరచి ప్రసంశా పత్రాన్ని అందజేశారు.

అంతేగాక నవంబర్ 17న లండన్లోని హౌస్ ఆఫ్ లార్డ్స్ లో జరగనున్న గ్లోబల్ బిసినెస్ సమ్మిట్ కు ముఖ్య ఆతిధిగా హాజరై అవార్డును స్వీకరించాలని కోరారు. నిస్వార్థంగా సమాజానికి సేవ చేస్తున్నందుకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఐఈబిఎఫ్ ప్రతినిధులు తెలిపారు. మొదటి నుండి సమాజ స్పృహ ఎక్కువగా ఉండే పవన్ జనసేన పార్టీని స్థాపించినప్పటి నుండి ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

 
Like us on Facebook