విలన్ విషయంలో పవన్ కళ్యాణ్ ఫుల్ హ్యాపీస్.!

pawan-kalyan-Sharad-Kelkar

పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్స్, మాస్ మసాలా ఎంటర్టైనర్స్ మరియు హై వోల్టేజ్ హీరోయిజం చూపించడంలో టాలీవుడ్ కి పెట్టింది పేరు. దీనికోసం మన డైరెక్టర్స్ ఫాలో అయ్యే ఫార్ములా హీరోకి గట్టి పోటీ ఇచ్చేలా విలన్ మరియు విలన్ క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా డిజైన్ చెయ్యడం. ఇప్పుడు ఇదే మేజిక్ ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ 2’లో కూడా ఫాలో అవుతున్నారు. అందులో భాగంగానే విలన్ కోసం ఎంతో మందిని పరిశీలించిన పవన్ కళ్యాణ్ అండ్ టీం ఫైనల్ గా మరాఠీ నటుడు శరత్ కేల్కర్ ని విలన్ గా ఫైనలైజ్ చేసారు.

అంతే కాకుండా ఇటీవలే జరిగిన ఫస్ట్ షెడ్యూల్ లో భాగంగా పూణేలో శరత్ కేల్కర్ పై కొన్ని సన్నివేశాలను షూట్ చేసారు. తెలుగు రాకపోయినా శరత్ డైలాగ్స్ విషయంలో ఎంతో కేర్ తీసుకొని తనే చెప్పాడట. శరత్ డెడికేషన్ చూసి ఈ చిత్ర టీం మెచ్చుకుంది. అంతే కాకుండా ఈ విజువల్స్ చూసిన పవన్ కళ్యాణ్ శరత్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడని పవన్ సన్నిహితులు చెబుతున్నారు. ఈ సినిమా లాంగ్ సెకండ్ షెడ్యూల్ జూలై వారం నుంచి ప్రారంభం కానుంది. పవర్ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి శరత్ మరార్ నిర్మాత. దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ ఇచ్నేమాలో హీరోయిన్స్ కోసం అన్వేషణ జరుగుతోంది.

Exit mobile version