పవన్ కళ్యాణ్ డాషింగ్ యాటిట్యూడ్ వీడియో వైరల్..!

పవన్ కళ్యాణ్ డాషింగ్ యాటిట్యూడ్ వీడియో వైరల్..!

Published on Nov 6, 2022 8:00 AM IST

టాలీవుడ్ హీరోస్ లో యూత్ లో సెపరేట్ ట్రెండ్ ని స్టార్ట్ చేసిన హీరో ఎవరన్నా ఉన్నారు అంటే అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఇప్పుడు సినిమాల్లో కాదు కాని ఒక దశాబ్దం రెండు దశాబ్దాల కిందటి పవన్ కళ్యాణ్ స్వాగ్ అండ్ యాటిట్యూడ్ నే వేరే లెవెల్లో ఉండేది. అందుకే పవన్ కళ్యాణ్ కి యూత్ లో భారీ క్రేజ్ ఏర్పడింది.

మరి పవన్ అయితే అప్పటి రేంజ్ డాషింగ్ యాటిట్యూడ్ లో సినిమాల్లో కనిపించడం తగ్గించేసాడు కానీ లేటెస్ట్ గా ఓ వీడియో అయితే ఫ్యాన్స్ లో సినీ వర్గాల్లో మంచి కేజ్రీగా మారింది. పవన్ కళ్యాణ్ నిన్న ఓ కార్యక్రమం మీద బయటకి వెళ్లాల్సి ఉండగా ఆ అంశంలో తన కార్ పైకి ఎక్కి కూర్చొని మాంచి స్వాగ్ లో కనిపించడం ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో క్రేజీ గా మారింది.

ఇలాంటివి కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే సాధ్యం అవుతాయని కూడా అంటున్నారు. దీనితో అయితే పవన్ కళ్యాణ్ మళ్లీ తన పాత రోజుల్లో కళ్యాణ్ ని ఫ్యాన్స్ కి సినీ వర్గాలకు గుర్తు చేసాడని చెప్పాలి. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ భారీ చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు