పవన్ ఫ్యాన్స్‌ను కలవరపెడుతోన్న ఉగాది సెంటిమెంట్!

24th, October 2016 - 05:34:08 PM

katamarayudu
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘కాటమరాయుడు’ ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. చాలా నెలల క్రితమే అనౌన్స్ అయిన ఈ సినిమా అనుకోని కారణాలతో వాయిదా పడుతూ వచ్చి ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా ప్రచారం పొందుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులంతా భారీ ఆశలు పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి ఆర్.టీ.నేసన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను వెంటనే మొదలుపెట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే మార్చి 29, 2017ను తమ సినిమాకు విడుదల తేదీగా ప్రకటించేశారు. ఉగాది పర్వదినం సందర్భంగా సినిమా విడుదలవుతోంది. అయితే ఈ ఉగాది సెంటిమెంటే పవన్ అభిమానులను కలవరపరుస్తోంది. ఈ ఏడాది ఉగాదికే విడుదలైన పవన్ సినిమా ‘సర్దార్ గబ్బర్ సింగ్’ బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పాలైంది. దీంతో మళ్ళీ ఉగాదికే ఆయన కొత్త సినిమా రానుందంటే ఆ మాటే వినడానికి పవన్ అభిమానులు భయపడుతున్నారు. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కాటమరాయుడు సినిమాను నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోంది.