భీమ్లా నాయక్ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులు!

Published on Jan 30, 2022 7:07 pm IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుపాటి లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. మరొక పక్క మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి మాటలు అందిస్తున్నారు. ఈ సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కావాల్సి ఉండగా, ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ చిత్రాల మేకర్స్ అభ్యర్థన తో సినిమా వాయిదా పడింది. ఫిబ్రవరి 25 వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ కొత్త తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా సోషల్ మీడియా లో ఈ చిత్రం కి సంబంధించిన అప్డేట్ పై అభిమానులు ఎదురు చూస్తున్నారు. భీమ్లా నాయక్ చిత్రం పై అప్డేట్ కావాలి అంటూ హ్యష్ ట్యాగ్ ఉపయోగిస్తున్నారు. #Wewantbheemlanayakupdate అంటూ ఉపయోగిస్తున్న హ్యష్ ట్యాగ్ ప్రస్తుతం పెద్ద ఎత్తున వైరల్ గా మారింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం :