పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నిర్మాత దిల్ రాజు కూడా ‘పింక్’ రీమేక్ పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. అయితే పవన్ మాత్రం ఇంకా ఈ విషయంపై ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఈ తర్జనభర్జన ఇలా సాగుతుండగానే పవన్ ఇంకో సినిమాకు సైన్ చేశారనే వార్తలు జోరందుకున్నాయి.
పవన్ నెక్స్ట్ చిత్రాన్ని క్రిష్ డైరెక్షన్లో చేస్తారని, ఇందులో పవన్ ఒక దొంగ పాత్రలో కనిపిస్తాడని రకరకాల వార్తలు మొదలయ్యాయి. తాజాగా ఈ చిత్రానికి కీరవాణి సంగీతం చేయనున్నారనే వార్త పుట్టుకొచ్చింది. ఇవన్నీ వింటున్న ఫ్యాన్స్ మాత్రం రీ ఎంట్రీ ఉవ్వబోయే మొదటి సినిమా గురించే పవన్ ఇంకా మాట్లాడలేదు.. అప్పుడే రెండో సినిమా గురించి వార్తలు మొదలయ్యాయని, వీటిని నమ్మాలో లేదో అర్థంకావట్లేదని అంటున్నారు.
