పవన్ సినిమా ఆడియోను అక్కడ ప్లాన్ చేశారు !
Published on Nov 21, 2017 11:37 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ల కాంబినేషన్లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత నిర్మాత ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న చిత్రం (ప్రొడక్షన్ నంబర్ 4) ‘అజ్ఞాతవాసి’. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. త్వరలో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ప్రారంభంకానుంది. వారణాసిలో జరగబోయే ఈ షెడ్యూల్ లో సినిమా టైటిల్ అనౌన్స్ చెయ్యనున్నారు.

అలాగే డిసెంబర్ రెండో వారంలో ఆడియోను విడుదల చెయ్యనున్నారు. తాజా సమాచారం ప్రకారం అమరావతిలో ఈ సినిమా ఆడియో వేడుక జరగనుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ సూచన మేరకు అమరావతిలో ఆడియో ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాలో కీర్తి సురేష్, అను ఇమ్మానుల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

 
Like us on Facebook