కాశిలో అజ్ఞాతవాసి !
Published on Nov 25, 2017 12:23 pm IST

పవన్ & త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయ్యింది. తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో నిన్న కంప్లీట్ చేసుకుంది. ఈరోజు చిత్ర యూనిట్ కాశి బయలుదేరుతోంది. ఈ షెడ్యూల్ తో సినిమా టాకీపార్ట్ పూర్తి అవుతుంది. ఎల్లుండి ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కాశివిశ్వనాధుని సన్నిధిలో అనౌన్స్ చెయ్యనున్నారు యూనిట్.

ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో S.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. అనిరుద్ సంగీతం అందించిన ఈ సినిమాలో మొదటి పాట విడుదలై పాపులర్ అయ్యింది. త్వరలో రెండో పాటను రిలీజ్ చెయ్యనున్నారు. భారి అంచనాల మద్య ఈ సినిమా జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 
Like us on Facebook