పవన్ సినిమా లేటెస్ట్ అప్‌డేట్స్

15th, August 2016 - 12:26:35 PM

pawan-kal
ఎన్నో మార్పులు జరిగిన అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా మొత్తానికి ఈ మధ్యే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకు ఎస్.జె.సూర్య దర్శకత్వం వహించాల్సి ఉండగా, చివరినిమిషంలో ఆయన తప్పుకోవడంతో ఆ తర్వాత డాలీ దర్శకుడిగా ఎంపికయ్యారు. దీంతో సినిమా సెట్స్‌పైకి వెళ్ళడానికి ఆలస్యమవుతూ వచ్చి ఈనెల్లోనే మొదలైంది. ఇక ప్రస్తుతం సినిమా షూటింగ్ జరుగుతున్నా, పవన్ కళ్యాణ్ మినహా ఇతర ఆర్టిస్ట్‌లు ఉండే సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నారు.

పవన్ ఈనెల 15న సెట్స్‌లో జాయిన్ కానున్నారని వినిపించినా, తాజాగా 18 నుంచి ఆయన సెట్స్‌లో జాయిన్ అవుతారని తెలిసింది. కేవలం ఐదు నెలల్లోనే సినిమాను పూర్తి చేసి ఫిబ్రవరిలో విడుదల చేయాలని టీమ్ భావిస్తోందట. శరత్ మరార్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఓ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ప్రేమకథగా ఈ సినిమా ప్రచారం పొందుతోంది.