‘మహేంద్రగిరి వారాహి’ కోసం పవన్ కళ్యాణ్ ?

సుమంత్‌ ప్రధానపాత్రలో రాబోతున్న సినిమా ‘మహేంద్రగిరి వారాహి’. ఈ సినిమా సెప్టెంబర్‌ 11న రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ ను టీమ్ ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం రెండున్నరేళ్లు చర్చలు జరిపాం. పైగా ఈ సినిమాలో ట్విస్ట్‌లు కూడా చాలా ఉన్నాయి. ఓ కీలకపాత్ర కోసం ఐశ్వర్యా రాజేశ్‌ ను సంప్రదించాం. కథ నచ్చడంతో వెంటనే నటించడానికి ఒప్పుకున్నారు’ అని తెలిపారు.

సుమంత్ ఇంకా మాట్లాడుతూ.. ‘దర్శకుడు అనుకున్న మొదట కథలో కొన్ని మార్పులు చేసి దీన్ని రూపొందించాం. ఏది ఏమైనా ఈ సినిమాలో నటించడం నాకు చాలా ఆసక్తిగా అనిపిస్తోంది’ అని తెలిపారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ అతిథిగా ఎవరిని పిలుస్తారు ? అని అడగగా.. దర్శకుడు సంతోష్‌ జాగర్లమూడి మాట్లాడుతూ.. పవన్‌ కల్యాణ్‌ను ఆహ్వానించాలని అనుకుంటున్నాం అని తెలిపారు.

Exit mobile version