అండర్ – 19 తెలుగు యంగ్ క్రికెటర్ కి పవన్ ఆర్ధిక సాయం.!

Published on Mar 8, 2022 6:25 pm IST

టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఒకరైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆఫ్ స్క్రీన్ లో అనేక మందికి ఎంతో సాయం అందిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే వాటిలో అన్ అఫీషియల్ ఎన్నో సహాయాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రతిభ ఉన్న యువతకి పవన్ ఎప్పుడూ సహకారం అందిస్తారు.

మరి అలా ఇప్పుడు చేసిన ఓ అనధికారిక చిన్న సాయమే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఏడాది భారత అండర్ 19 క్రికెట్ కప్ లో వైస్ కెప్టెన్ గా మరియు బ్యాట్స్ మెన్ గా సత్తా చాటిన తెలుగు యువకుడు షైక్ రషీద్ కి పవన్ ఆర్ధికంగా సహాయం చేసినట్టుగా తెలుస్తుంది.

గుంటూరుకి చెందిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ ఆటగాడి కోసం తెలుసుకున్న పవన్ తన ‘పవన్ కళ్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్’ ట్రస్ట్ నుంచి 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందించించారట. ప్రస్తుతం ఆ చెక్ కి సంబంధించి పవన్ అందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

అలాగే దీనిని పవన్ పార్టీకి సంబంధించిన అనుచరులు రషీద్ నివాసానికి వెళ్లి అందించినట్టు తెలుస్తుంది. అలాగే పవన్ త్వరలోనే రషీద్ ని కలవొచ్చని మరో టాక్.

సంబంధిత సమాచారం :