హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించనున్న పవన్!

16th, January 2017 - 10:30:01 AM

pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటు సినిమాల్లో తిరుగులేని స్టార్‌డమ్‌తో దూసుకుపోతూనే, రాజకీయాల్లోకి అడుగుపెట్టి జనసేన పేరుతో పార్టీ నెలకొల్పి ప్రజా కార్యక్రమాల్లోనూ పాలు పంచుకుంటున్నారు. ఇక తన ప్రజా కార్యక్రమాలతో యువతకు ఆదర్శంగా నిలిచిన పవన్ కళ్యాణ్‌కు తాజాగా ఓ అరుదైన అవకాశం దక్కింది.

అమెరికాలోని ప్రఖ్యాత యూనివర్సిటీల్లో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీలో ఫిబ్రవరి నెలలో జరగనున్న ‘ఇండియా కాన్ఫరెన్స్ 2017’ ఈవెంట్‌లో భాగంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. పవన్ కళ్యాణ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించిన సంస్థ నిర్వాహకులు ఆయన వస్తారన్న మాట ఇవ్వడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఫిబ్రవరి 10,11వ తేదీల్లో ఈ ఈవెంట్ జరగనుంది. ఈ రెండు తేదీల్లో ఏదో ఒక రోజున పవన్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.