మరోసారి పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నాడట..!

Published on Dec 23, 2021 3:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరోసారి దేవుడిగా కనిపించబోతున్నాడట. వెండి తెరపై ‘గోపాల గోపాల’ సినిమాలో పవన్ కళ్యాణ్ అభినవ కృష్ణుడిగా నటించి ఎంతగానో అలరించాడు. మనిషి రూపంలోనే కనిపిస్తూ కృష్ణుడిగా తన లీలలను చూపిస్తూ కనువిందు చేశాడు. ఆ పాత్రను ప్రేక్షకులు చక్కగా ఆదరించారు. అయితే ఇప్పుడు మరోసారి పవన్ వెండితెరపై దేవుడిగా కనిపించడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

తెలుగులో విలన్‌గా నటిస్తూ బిజీ అయిన తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని తమిళంలో ‘వినోధాయ సిత్తం’ అనే సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సముద్రఖనితో పాటు తంబి రామయ్య, సంచిత శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో తంబి రామయ్య హఠాత్తుగా మరణించి పరలోకంలో అడుగుపెడతాడు. అయితే అక్కడ తంబి రామయ్య ప్రశాంతంగా లేకపోవడం చూసిన దేవుడు అందుకు గల కారణాన్ని అడిగి తెలుసుకుంటాడు. మూడు నెలల పాటు నన్ను బ్రతికిస్తే తిరిగి బాధ్యతలు నెరవేర్చుకుని వచ్చేస్తానని తంబి రామయ్య దేవుడిని కోరతాడు. దానికి దేవుడు అంగీకరించడంతో తంబి రామయ్య తిరిగి భూమి మీదకి వస్తాడు. ఈ క్రమంలో అతను భూమి మీద ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు అనేది ఈ సినిమా కథ.

అయితే తమిళ మూవీలో దేవుడి పాత్రను సముద్రఖని చేశాడు. తెలుగులో ఈ పాత్రను పవన్ కళ్యాణ్ చేస్తున్నాడని, తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ సినిమా కథలో మార్పులు చేస్తున్నారట. సముద్రఖని దర్శకత్వంలోనే ఈ రీమేక్ తెరకెక్కబోతుందని, త్వరలోనే మిగిలిన తారాగణాన్ని ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :