‘పవన్’ పై యాక్షన్ సీక్వెన్స్ కి రంగం సిద్ధం!

Published on May 30, 2022 8:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ వచ్చే వారం నుంచి స్టార్ట్ కానుంది. ఈ కొత్త షెడ్యూల్ లో పవన్ పై యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. ఇక ఈ సీక్వెన్స్ కోసం ఇప్పటికే ప్రత్యేకమైన సెట్స్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ షెడ్యూల్ తో సినిమాలో కీలక భాగం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :