‘పవన్ – క్రిష్’ సినిమా షూటింగ్ డేట్స్ ఫిక్స్ !

‘పవన్ – క్రిష్’ సినిమా షూటింగ్ డేట్స్ ఫిక్స్ !

Published on Feb 6, 2022 9:48 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ కి డేట్స్ ను ఫిక్స్ చేసింది టీమ్. మార్చి ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. ముందుగా యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయనున్నారు. ఇక ఈ సీక్వెన్స్ కోసం ఇప్పటికే ప్రత్యేక సెట్స్ కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నట్టు ఈ షెడ్యూల్ తో సినిమాలో కీలక భాగం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట.

ఈ సీక్వెన్స్ కు సంబంధించిన స్క్రిప్ట్ గురించే పవన్ కల్యాణ్ తో క్రిష్ ప్రస్తుతం చర్చిస్తున్నాడు. ఈ చర్చకు సంబంధించిన ఫోటోనే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది.

ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు