కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసిన ‘హరిహర వీరమల్లు’ !

కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసిన ‘హరిహర వీరమల్లు’ !

Published on Mar 28, 2022 9:07 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా కొత్త షెడ్యూల్ కోసం టీమ్ రెడీ అయ్యారు. రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ ని నిర్మించారు. ,అన్నట్టు ఈ షెడ్యూల్ తో సినిమాలో కీలక భాగం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట. ఇక ప్రస్తుతం ఈ షెడ్యూల్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా పాల్గొననుంది.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. అలాగే ఈ మూవీలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తోంది. ఇక ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా తీసుకురానున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు