పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్ రిలీజ్ డేట్ అదేనా ?

పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ టీజర్ రిలీజ్ డేట్ అదేనా ?

Published on Jan 1, 2023 3:00 AM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న హరిహర వీరమల్లు మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. భారీ పాన్ ఇండియన్ మూవీగా అత్యున్నత సాంకేతిక విలువలతో హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి ఇప్పటికే రిలీజ్ అయిన రెండు గ్లింప్స్ టీజర్స్, పోస్టర్స్ అందరినీ ఎంతో ఆకట్టుకుని మూవీ పై భారీ అంచనాలు ఏర్పరిచాయి. పవన్ కళ్యాణ్ ఇందులో వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా ఇస్మార్ట్ శంకర్ భామ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. నిర్మాత ఏ ఎం రత్నం ఈ మూవీని ఎంతో గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.

ఇక హరిహర వీరమల్లు మూవీని మార్చి 30న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించిన మేకర్స్ ఈ మూవీ అఫీషియల్ టీజర్ ని రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేయనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. మరోవైపు న్యూ ఇయర్ కానుకగా పవన్ కళ్యాణ్ ఒకప్పటి సూపర్ హిట్ మూవీ ఖుషి స్పెషల్ షోలు నిన్న ప్రదర్శించడంతో వాటిని వీక్షించిన నిర్మాత ఏ ఎం రత్నం మాట్లాడుతూ, హరిహర వీరమల్లు చాలావరకు షూటింగ్ పూర్తి చేసుకుందని, ఇంకొంత షూట్ తో పాటు విజువల్ ఎఫెక్ట్స్ వంటివి మిగిలి ఉన్నాయని అన్నారు. పవన్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునేలా అద్భుతంగా క్రిష్ ఈ మూవీని తెరకెక్కిస్తున్నారని చెప్పిన రత్నం, మూవీ యొక్క టీజర్ జనవరి 26న రానున్నట్లు సూచన ప్రాయంగా హింట్ అయితే ఇచ్చారు. అయితే దీనిపై పక్కాగా అతి త్వరలో అధికారికంగా ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు