పవర్ వచ్చాక పవర్ స్టార్ అని పిలవండి – పవన్ కళ్యాణ్

Published on Oct 2, 2021 7:25 pm IST


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సమయంలో అభిమానుల నుంచి అరుపులు కేకలు వినిపించాయి. ఈ సమయంలో కార్యకర్తలను, అభిమానులను ఉద్దేశించి అరవకండని.. ఇలా అరిచి నన్ను కూడా గెలిపించలేకపోయారు ప్రయోజనం ఏమిటని, వాస్తవాలు మాట్లాడుకుందాం పవర్ లేని వాడికి పవర్ స్టార్ ఎందుకని, పవర్ వచ్చాక పవర్ స్టార్ అని పిలవండని, సీఎం అయ్యాక సీఎం అని పిలవండని అప్పటిదాక జనసేనానిగా పిలవండి ఒప్పుకుంటానని అన్నారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై కూడా పవన్ నిప్పులు చెరిగారు. రాజకీయాలు తనకు సరదా కాదని బాధ్యత అని అన్నారు. వైసీపీ కులాల పేరిట రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం తమని తొక్కాలని చూస్తుందని, ప్రభుత్వం తొక్కేకొద్ది పైకి లేస్తామని అన్నారు.

సంబంధిత సమాచారం :