“హరి హర వీరమల్లు” కోసం డైరక్టర్ క్రిష్ తో పవన్ రీడింగ్ సెషన్

Published on Dec 20, 2021 8:30 pm IST


పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తర్వాత నుండి వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం హారిహర వీరమల్లు. పీరియాడిక్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార చిత్రాలు, వీడియో లు విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

తాజాగా ఈ చిత్రం కి సంబంధించిన ఒక న్యూస్ బయటికి వచ్చింది. పవన్ కళ్యాణ్ డైరక్టర్ క్రిష్ తో కలిసి స్క్రిప్ట్ రీడింగ్ సెషన్ లో పాల్గొనడం జరిగింది. ఇందుకు సంబంధించిన ఒక ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ కీలక పాత్ర లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :