వైరల్ పిక్స్ : బైక్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

వైరల్ పిక్స్ : బైక్ పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Published on Dec 2, 2022 2:30 AM IST

టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు చేస్తోన్న విషయం తెలిసిందే. ఏ ఎం రత్నం నిర్మాతగా మెగాసూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న హరిహర వీరమల్లు మూవీలో పవన్ వీరమల్లు అనే పవర్ఫుల్ పాత్రలో కనబడనుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన రెండు టీజర్స్ పవన్ ఫ్యాన్స్ ని ఆడియన్స్ ని ఆకట్టుకుని మూవీ పై మంచి అంచనాలు ఏర్పరిచాయి.

అయితే విషయం ఏమిటంటే, ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్న ఈ మూవీ యొక్క షూటింగ్ గ్యాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ బైక్స్ పై సరదాగా వెళ్తున్న పిక్స్ కొద్దిసేపటి క్రితం ఇంటర్నెట్ లో దర్శనం ఇచ్చాయి. ఆ పిక్స్ చూసిన పలువురు పవన్ ఫ్యాన్స్ వాటిని సోషల్ మీడియాలో మరింతగా వైరల్ చేస్తున్నారు. కాగా హరిహర వీరమల్లు మూవీ వచ్చే ఏడాది మార్చి 30 న ప్రేక్షకుల ముందుకి రానున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు