వైరల్ : లుక్ మార్చిన పవన్..సినిమాలకి ఇంకా టైం ఉందా?

Published on Sep 30, 2022 9:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో “హరిహర వీరమల్లు” అనే భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. పవన్ నుంచి మొదటి పాన్ ఇండియా సినిమా ఇది కావడంతో దీనిపై అనేక అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన పవర్ గ్లాన్స్ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ని అయితే అందుకుంది.

ఇక ఈ సినిమా కోసమే పవన్ గత కొన్నాళ్ల నుంచి అదే కొత్త లుక్ లో ఉండిపోయారు. కానీ ఇపుడు లేటెస్ట్ గా అయితే మళ్ళీ కొత్త లుక్ తనది బయటకి వచ్చింది. హైర్ కట్ సహా లైట్ గా గడ్డంతో పవన్ కనిపిస్తున్నారు. మరి దీనితో అయితే ఈ చిత్రం షూట్ కి పవన్ మళ్ళీ రెడీగా లేనట్టే అనుకోవాలా అనిపిస్తుంది. ప్రస్తుతానికి అయితే షూట్ రీస్టార్ట్ అక్టోబర్ మధ్యలో ఉండవచ్చని టాక్ మరి అప్పటిలోపు మళ్ళీ ఏమన్నా మారుస్తారేమో చూడాలి.

సంబంధిత సమాచారం :