మాసివ్ : పవన్ నాన్ సినిమా వీడియోకి సెన్సేషనల్ రెస్పాన్స్.!

మాసివ్ : పవన్ నాన్ సినిమా వీడియోకి సెన్సేషనల్ రెస్పాన్స్.!

Published on Dec 8, 2022 1:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే టాలీవుడ్ లో భారీ క్రేజ్ కి పెట్టింది పేరు.. తన లాస్ట్ సినిమా రీమేక్ తోనే పవన్ సుమారు వంద కోట్ల మేర వసూళ్లు రాబట్టేసాడు. ఇక ఇపుడు అయితే డైరెక్ట్ సినిమాల మీదే ఎక్కువ దృష్టి పెట్టడంతో వీటిపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. అలాగే పవన్ అయితే ఇప్పుడు సినిమాలతో పాటుగా తన పొలిటికల్ పనుల్లో కూడా బిజీగా కనిపిస్తున్నారు.

అలాగే తన సోషల్ మీడియా విషయానికి వస్తే ఒక్క సినిమా పోస్ట్ కూడా కనిపించదు. మరి ఇలా నాన్ సినిమా పోస్ట్ తోనే పవన్ పెట్టిన లేటెస్ట్ పోస్ట్ సెన్సేషనల్ రెస్పాన్స్ ను అందుకోవడం ఆసక్తిగా మారింది. నిన్ననే తాను పర్సనల్ గా ప్రచారానికి రెడీ చేయించుకున్న “వారాహి” అనే భారీ వాహనాన్ని పరిచయం చేస్తూ తన ట్విట్టర్ లో పోస్ట్ చేయగా ఇంకా 24 గంటలు పూర్తి కాక ముందే 1 మిలియన్ వ్యూస్ అయితే ఈ వీడియోకి వచ్చాయి.

మరి ఇది సినిమా సంబంధిత పోస్ట్ కాకపోవడం ఒకటి అయితే ఇందులో అసలు తాను కూడా కనిపించకుండా 1 మిలియన్ వ్యూస్ అందుకోవడం అనేది మాసివ్ అనే చెప్పాలి. అలాగే మన టాలీవుడ్ హీరోస్ లో అయితే 1 మిలియన్ వీడియో కలిగిన మరో హీరోగా పవన్ నిలవగా ఇలా నాన్ సినిమా వీడియో తో ఈ రెస్పాన్స్ అందుకున్న మొదటి హీరోగా తాను నిలిచాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు