ఈ సినిమాకి కూడా “వీరమల్లు” లుక్ లోనే పవన్..లేక.?

Published on Jul 7, 2022 12:30 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా సెట్స్ లోకి రావాలని చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్నారు. గత రెండు నెలల కితం తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” షూట్ లో పాల్గొనగా మళ్ళీ చాలా గ్యాప్ ను పవన్ తీసుకున్నాడు. అయితే ఇక ఎప్పుడు మిగతా సినిమాల షూటింగ్ లో పవన్ పాల్గొంటాడు అనేది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారగా పవన్ అయితే ఇప్పుడు మరో రీమేక్ వినోదయ సైతం కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి.

అయితే ఈ సినిమా కోసం పవన్ ఏమన్నా కొత్త లుక్ మారుస్తున్నాడా లేదా అనేది ఇపుడు ఆసక్తిగా మారగా అలాంటిది ఏమి లేదని తెలుస్తుంది. ఇంకా వీరమల్లు లుక్ లోనే తాను ఉండగా దానితోనే కంప్లీట్ చేసి వీరమల్లు షూట్ లో కూడా పాల్గొననున్నట్టు టాక్. ప్రస్తుతం అయితే మళ్ళీ పవన్ క్లీన్ షేవ్ లుక్స్ వైరల్ గా మారాయి. మరి పవన్ అయితే ఎప్పుడు ఈ సినిమాలు రీస్టార్ట్ చేస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం :