ఎనర్జిటిక్ గా పవర్ స్టార్.. కొత్త ఊపు తెచ్చిన కొత్త పోస్టర్, మేకర్స్ గ్యారెంటీ!

UBS

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న అవైటెడ్ మాస్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”(Ustaad Bhagat Sing). దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న ఈ సినిమా కోసం గబ్బర్ సింగ్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మళ్ళీ భారీ హిట్ కొట్టాలని అంతా చూస్తుండగా ఈ సినిమాపై మేకర్స్ మరింత హైప్ ఎక్కించే పనిలో ఉన్నారు.

ఒకో పోస్టర్ తో ఫ్యాన్స్ కి ఇప్పుడు వరకు ఇచ్చిన ఊపు వేరు లేటెస్ట్ గా వదిలిన పోస్టర్ ఇచ్చిన ఊపు వేరే అని చెప్పాల్సిందే. పవర్ స్టార్ నుంచి ఒక ఊహించని ఎనర్జిటిక్ మోడ్ లో ఉన్న పోస్టర్ ని దింపి మేకర్స్ ఓ ప్రామిస్ కూడా చేస్తున్నారు. ఈ సినిమా మొత్తం కూడా ఇదే ఎనర్జిటిక్ పవర్ స్టార్ ని మీరు చూడబోతున్నారు అంటూ ప్రామిస్ చేస్తున్నారు.

ఇంతేనా ఈ పోస్టర్ చూసాక ఫ్యాన్స్ లోనే కొత్త హైప్ మొదలైంది. దీనితో హరీష్ శంకర్ వర్క్ పై అభిమానులు మళ్ళీ అంచనాలు మరింత ఎక్కువ చేసుకుంటున్నారు. ఇదే మూమెంట్ లో సరైన ట్రైలర్ కట్ లాంటివి కూడా పడితే ఉస్తాద్ పై సమీకరణాలు మొత్తం మారినా ఎలాంటి ఆశ్చర్యం లేదు.

Exit mobile version