‘మా’ ఎన్నికలు : తన ఓట్ వేసాక పవన్ కీలక వ్యాఖ్యలు.!

Published on Oct 10, 2021 9:35 am IST


ఈరోజు టాలీవుడ్ ఇండస్ట్రీలో “మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్”(మా) ఎన్నికలు ఎంతో ఆసక్తికర పరిస్థితుల్లో జరగనున్న సంగతి తెలిసిందే. అయితే ఆల్రెడీ ఈరోజు తెల్లవారు జాము నుంచి జూబ్లీ హిల్స్ లో మొదలు కాగా టాలీవుడ్ ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ వెళ్లి ఈరోజు తన ఓటుని వేసి బయటకి వచ్చారు. అయితే ఈ క్రమంలో మా ఎన్నికలపై పవన్ కీలక వ్యాఖ్యలు చెయ్యడం ఆసక్తిగా మారింది.

“తిప్పి కొడితే 900 ఓట్లు కూడా ఈ ఎన్నికల్లో ఉన్నాయి, దీనికి కూడా ఇంతలా వ్యక్తిగత దూషణలు అవసరమా? సినిమాలు చేసేవారు ఆదర్శంగా ఉండాలి అలాగే సినిమా పరుస్తామా చీలడం అనే ప్రశ్నే ఉండదు అని తేల్చి చెప్పేసారు. అంతేకాకుండా మోహన్ బాబు చిరంజీవి ఇద్దరూ కూడా చాలా మంచి స్నేహితులు ఈ ఎన్నికలకు ఇంత హడావుడి అవసరమా” అని పవన్ మీడియాతో మాట్లాడ్డం జరిగింది. దీనితో ఇప్పుడు పవన్ మాటలు మరింత ఆసక్తిని నెలకొల్పాయి.

సంబంధిత సమాచారం :