వైరల్ పిక్ : పవర్ఫుల్ మార్షల్ ఆర్ట్స్ లుక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

Published on Dec 9, 2022 10:00 pm IST


టాలీవుడ్ యాక్టర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. నిధి అగర్వాల్ హీరోయిన్ గా రూపొందుతోన్న ఈ మూవీని మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏఎం రత్నం నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని జ్ఞానశేఖర్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు.

భారీ పాన్ ఇండియన్ మూవీ గా రూపొందుతోన్న హరిహర వీరమల్లు పై పవర్ స్టార్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ కోసం శారీరకంగా ఎంతో కష్టపడి పలు యాక్షన్, ఫైట్ సీన్స్ లో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, లేటెస్ట్ గా మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ తీసుకుంటున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల తరువాత మరొక్కసారి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకుంటున్నాను అంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితం తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్స్ లో పెట్టిన ఒక పిక్ ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. కాగా ఆ పిక్ ని పలువురు పవన్ ఫ్యాన్స్ మరింతగా వైరల్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :