అమితాబ్ ను కలిసిన పవన్ కళ్యాణ్

Published on Feb 15, 2022 9:00 pm IST

నేషనల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ‘ప్రాజెక్ట్ కె’ అంటూ వర్కింగ్ టైటిల్ తో మొదలైన ఈ సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. కాగా ఈ ‘ప్రాజెక్ట్ కే’ చిత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుపుకుంటుంది. షూటింగ్ కోసం అమితాబ్ హైదరాబాద్ వచ్చారు. అయితే, అమితాబ్ బచ్చన్ ను జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిశారు.

కాగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ లో పాల్గొంటున్నఅమితాబ్ వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లి కలిశారు. మర్యాద పూర్వకంగానే ఆయనను పవన్ కలిసినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో ప్రధాన నటీనటులు అందరూ నటిస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ ప్రస్తుతం ఈ చిత్రంలోని కీలక సీక్వెన్స్ ను ముందుగా తీయాలని చూస్తున్నారు. తన గత చిత్రం ‘మహానటి’ని అద్భుతంగా తెరకెక్కించి అందరి మన్ననలు పొందారు నాగ్ అశ్విన్.

సంబంధిత సమాచారం :