‘పవన్ కళ్యాణ్’ సినిమా సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడే !

pawan-kal
దర్శకుడు ‘డాలి’, ‘పవన్ కళ్యాణ్’ ల కాంబినేషన్ లో రానున్న సినిమాపై గత కొన్నాళ్లుగా తీవ్ర సందిగ్దత నెలకొని ఉంది. ఒకసారి డాలి స్క్రిప్ట్ మారుస్తున్నాడంటే మరోసారి అసలు సినిమానే ఆగిపోనుందని రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. కానీ వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ సినిమా ఎప్పుడు మొదలయ్యేది తెలిసిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం ఆగష్టు 6 నుండి సెట్స్ పైకి వెళ్లనుంది.

సినిమా సెట్స్ పైకి వెళ్లిన రెండు మూడు రోజుల తరువాత ‘పవన్ కళ్యాణ్’ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటారు. గ్రామీణ నైపథ్యంలో సాగే ఫ్యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఆగష్టు నుండి వరుసగా 5 నెలలపాటు షూటింగ్ జరిపి డిసెంబర్ కల్లా చిత్రాన్ని పూర్తిచేసి 2017 సంక్రాంతికి చిత్రాన్ని రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. సర్దార్ గబ్బర్ సింగ్ నిర్మాత ‘శరత్ మారార్’ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.