టాక్..పవన్ సినిమాలు మరింత ఆలస్యం కాబోతున్నాయా?

Published on Jun 1, 2022 2:00 am IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వాటిలో ఆల్రెడీ భారీ చిత్రం “హరిహర వీరమల్లు” సెట్స్ పై ఉండగా ఆ ఆ తర్వాత మరో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా లైన్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు తన లైనప్ లో ఉండే సినిమాల షూటింగ్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నట్టు టాక్ వినిపిస్తుంది.

ప్రస్తుతం పవన్ తన పొలిటికల్ పనులకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నందున ఈ ఆలస్యం అన్నట్టు వినికిడి. అయితే ఆల్రెడీ పవన్ కమిట్ అయ్యిన సినిమాలకి సెట్ పనులు ప్రీ ప్రొడక్షన్ పనులు ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. మరి వీటిపై అయితే ప్రస్తుతం మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే పవన్ ఇప్పుడు వీరమల్లు తో పాటుగా భవదీయుడు భగత్ సింగ్ అలాగే మరో రీమేక్ ని కూడా చేస్తున్నట్టు సమాచారం.

సంబంధిత సమాచారం :