అజ్ఞాతవాసిలో పవన్ కళ్యాణ్ పేరు అదే !

పవన్ కల్యాణ్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం “అజ్ఞాతవాసి”. వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తం పూర్తి అయ్యాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పేరు అభిజిత్ భార్గవ. ఎబి ఎవడో నీ బేబి అనే పాట పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నేమ్ తో స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే.

హాసిని అండ్ హారిక క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మించిన ఈ మూవీలో అను ఇమ్యానుయేల్, కీర్తి సురేష్ నటిస్తున్నారు. కుష్బూ, ఆది పినిశెట్టి కీలక రోల్ లో కనిపిస్తోన్న ఈ సినిమాకు అనిరుద్ సంగీతం ప్రధాన బలం కానుంది. ఈ రోజు సాయంత్రం అజ్ఞాతవాసి ట్రైలర్ విడుదల కానుంది.