పవన్ & త్రివిక్రమ్ టైటిల్ ప్రకటన ఆ రోజే !
Published on Oct 24, 2017 12:12 pm IST

ప‌వ‌న్ క‌ల్యాణ్ – త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌ సినిమా మొద‌లై చాలా కాల‌మైంది. అయితే ఈసినిమా టైటిల్ ఏంట‌న్న విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కూ ఓ క్లారిటి లేదు. సోష‌ల్ మీడియాలో అభిమానులు రకరకాల టైటిల్స్ తో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ పోస్ట్ చేస్తున్నారు. వాటిపై చిత్ర‌బృందం ఇప్ప‌టి వ‌ర‌కూ స్పందించ‌లేదు. ఇప్పుడు స‌రికొత్త‌గా మ‌రో టైటిల్ వ‌చ్చి చేరింది. అదే ‘అజ్ఞాతవాసి’.

దాదాపు ఇదే టైటిల్ ను ఫిక్స్ చేసే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. దీపావళి రోజు ఈ టైటిల్ మరియు పోస్టర్ అధికారికంగా విడుదల చేస్తానని వార్తలు వచ్చాయి, కాని జరగలేదు. తాజా సమచారం ప్రకారం త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా న‌వంబ‌ర్ 7 న టైటిల్ ఆఫిషియల్ గా విడుదల విడుదల చెయ్యబోతున్నారని తెలుస్తుంది.

 
Like us on Facebook