అనౌన్స్ మెంట్ కి రెడీ అయిన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ ?

అనౌన్స్ మెంట్ కి రెడీ అయిన పవన్ కళ్యాణ్ న్యూ మూవీ ?

Published on Dec 4, 2022 1:28 AM IST


ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ చేస్తోన్న విషయం తెలిసిందే. భారీ పీరియాడిక్ డ్రామా మూవీగా గ్రాండ్ లెవెల్లో పాన్ ఇండియా రేంజ్ లో మెగాసూర్య ప్రొడక్షన్స్ బాన్న్ర పై ఏ ఎం రత్నం దీనిని నిర్మిస్తున్నారు. ఇక దీని తరువాత హరీష్ శంకర్ తో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భవదీయుడు భగత్ సింగ్ మూవీ చేయనున్నారు పవన్. ఇప్పటికే ఈ మూవీ యొక్క అధికారిక ప్రకటన కూడా వచ్చింది.

అయితే విషయం ఏమిటంటే, రేపు ఉదయం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్న సరికొత్త మూవీ యొక్క అనౌన్స్ మెంట్ రానుంది. రన్ రాజా రన్, సాహో మూవీస్ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. కాగా రేపు ఈ మూవీకి సంబందించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు