‘భీమ్లా’ ని పరిచయం చేసిన కళాకారునికి పవన్ ఆర్ధిక సాయం.!

Published on Sep 4, 2021 7:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి దేశ సంస్కృతి అయినా వాటి మూలాలు అయినా ఎంతటి అభిమానమో అందరికీ తెలిసిందే. అందుకే ఎప్పుడు నుంచి తన సినిమాల్లో ఏదొక విధంగా ఆ సందేశాలను అందిస్తారు. అలాగే దీనితో పాటుగా జానపద గేయాలకి ఆ కళాకారులకి కూడా ఎంతో ప్రాధాన్యతని పవన్ ఇస్తారు. అందులో భాగంగానే ఎన్నో పాటలను కూడా పవన్ పాడటం తన సినిమాల్లో పెట్టించడం వంటివి చేశారు చేస్తూ వస్తున్నారు.

మరి లేటెస్ట్ గా తన భీమ్లా నాయక్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ తో అంతరించిపోతున్న కిన్నెర మెట్ల కళని పరిచయం చేసి భారీ రెస్పాన్స్ ను అందుకున్నారు. అయితే ఈ సాంగ్ లో మొదట భీమ్లా ని పరిచయం చేస్తూ కిన్నెర కళాకారుడు శ్రీ దర్శనం మొగులయ్య గారికి కూడా అపారమైన గుర్తింపు వచ్చింది. దీనితో అక్కడ నుంచి మరింత గుర్తింపు తెచ్చుకున్న మొగులయ్యకు ఆర్ధికంగా ఇబ్బందులతో పాటుగా ఈ కళను మరింత విస్తరింపజెయ్యాలనే దృఢ సంకల్పం కూడా ఉంది.

మరి దీనితో వారికి అండగా ఉండాలనే 2 లక్షల రూపాయల ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నట్టుగా తెలిపారు. దీనితో పవన్ సాయానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక థమన్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా త్రివిక్రమ్ కీలక పాత్ర పోషించారు. ఇక అలాగే ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :