ఆఫ్ లైన్ లో “ఓజి” మేనియా!

ఆఫ్ లైన్ లో “ఓజి” మేనియా!

Published on Feb 16, 2025 8:03 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో దర్శకుడు సుజిత్ తో చేస్తున్న భారీ చిత్రం “ఓజి” కూడా ఒకటి. అనౌన్స్ చేసిన నాటి నుంచి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా హవా ఇప్పటికి చెక్కు చెదరడం లేదు. మెయిన్ గా ఆఫ్ లైన్ లో అయితే వేరే లెవెల్ అని చెప్పాల్సిందే. పవన్ బయట ఏ మీటింగ్ హాజరైనా కూడా ఓజి నామ స్మరణ తప్పడం లేదు.

నిన్న విజయవాడలో జరిగిన ఓ మీటింగ్ అది పవన్ కళ్యాణ్ కి సంబంధం లేకపోయినప్పటికీ తను హాజరైన కారణంతో ఆ మీట్ లో కూడా ఓజి ఫీవర్ వినిపించింది. దీనితో మేకర్స్ కూడా ఓజి మేనియా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలా మొత్తానికి ఓజి ఎప్పుడు వచ్చినా బ్లాస్ట్ చేసేలా ఉందని చెప్పి తీరాల్సిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు