మీసం తిప్పి చెప్తున్నా.. “ఓజి” అన్నిటికీ సమాధానం ఇస్తుంది!

మీసం తిప్పి చెప్తున్నా.. “ఓజి” అన్నిటికీ సమాధానం ఇస్తుంది!

Published on Jan 14, 2025 8:01 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లో భారీ హైప్ ఉన్న వన్ అండ్ ఓన్లీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది “ఓజి” అని చెప్పాలి. అనౌన్స్ చేసిన రోజు నుంచి ఇప్పుడు వరకు ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. అయితే ఈ సినిమా విషయంలో థమన్ చేసిన కామెంట్స్ ఇపుడు ఓ రేంజ్ లో హైప్ ఇస్తున్నాయి.

మీసం తిప్పి మరీ చెప్తున్నాను ఓజి సినిమా అన్నిటికీ సమాధానం ఇస్తుంది అని తను చాలా నమ్మకంగా చెబుతున్నాడు. తమిళ్ సినిమా నుంచి లియో, బీస్ట్, విక్రమ్, జైలర్ లాంటి సినిమాలు ఎలాగో వాటి అన్నిటికీ సమాధానం ఇచ్చేలా ఓజి ఉంటుంది అని సాలిడ్ కామెంట్స్ చేసాడు.

అలాగే వాళ్ళ సినిమాలు కోసం మనం ఎలా మాట్లాడుకున్నామో ఓజి కోసం మిగతా వాళ్ళు అలా మాట్లాడుకునే రేంజ్ లో ఉంటుంది అని థమన్ ఓ రేంజ్ లో హైప్ ఎక్కించాడు. మరి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ సినిమా వచ్చాక ఊచకోత ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు