చరణ్ పై పవన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్.!

ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంతా కూడా తమ ప్రైడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) బర్త్ డే వేడుకల్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో చరణ్ కి పాన్ ఇండియా వైడ్ గా అనేకమంది ప్రముఖులు తమ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తుండగా వారిలో తమ కుటుంబీకులు కూడా చేస్తున్న విషెష్ వైరల్ గా మారాయి. మరి వాటిలో లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన స్పెషల్ విషెష్ మెగా ఫ్యాన్స్ లో నూతన ఉత్సాహాన్ని తెచ్చింది.

మరి పవన్ చరణ్ పై ఆస్కార్ ఉన్నత పురస్కారం అందుకున్న చిత్రంలో నటించి గ్లోబల్ స్టార్ స్థాయికి చేరుకున్న రామ్ చరణ్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని చరణ్ చాలా గౌరవ మర్యాదలు, దైవ భక్తి మెండుగా కలవాడు అని అలాగే కొత్త విషయాలు నేర్చుకోవడంలో చరణ్ విద్యార్థిలా శిక్షణ తీసుకుంటాడు అని తండ్రికి తగ్గ తనయుడుగా చరణ్ ముందు రోజుల్లో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలి అని కోరుకుంటున్నాను అని పవన్ తెలిపారు. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారాయి.

Exit mobile version