పవన్ కోరిక మీదట త్రివిక్రమ్ అందుకున్నాడు !

Published on Nov 8, 2021 2:00 pm IST

దర్శకుడు త్రివిక్ర‌మ్ లో పాటల రచయిత కూడా ఉన్నాడు. అయితే, మాటల ర‌చ‌యితగానే త్రివిక్రమ్ కి గొప్ప పేరు ఉంది. అందుకే త్రివిక్రమ్ పాటలు రాయడానికి ఆసక్తి చూపించలేదు. కాకపోతే.. భీమ్లా నాయక్ కోసం ‘లాలా భీమ్లా’ అంటూ త్రివిక్ర‌మ్ పాట‌ రాయాల్సి వచ్చింది. మొదట వేరే రచయిత ఈ ‘లాలా భీమ్లా’ సాంగ్ రాస్తే.. పవన్ కళ్యాణ్ కు నచ్చలేదట. దాంతో పవన్ ‘మీరే రాయండి’ అంటూ త్రివిక్రమ్ ను కోరాడట.

పవన్ కోరిక మీదట త్రివిక్రమ్ మొత్తానికి ఈ పాటను అద్భుతంగా రాశాడు. గతంలో ర‌వితేజ న‌టించిన‌ ఒక రాజు, ఒక రాణి సినిమా కోసం త్రివిక్ర‌మ్ పాట‌లు రాశాడు. మళ్ళీ 18 ఏళ్ల త‌ర‌వాత త్రివిక్రమ్ రాసిన పాట ఇదే. “పది పడగల పాము పైన పాదమెట్టిన సామి తోడు.. పిడుగులొచ్చి మీద పడితే కొండగొడుగు నెత్తినోడు…“ అంటూ త్రివిక్రమ్ ఈ పాటను రాసిన విధానం చాలా బాగుంది.

సంబంధిత సమాచారం :