“భీమ్లా నాయక్” సినిమాటోగ్రాఫర్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు..!

Published on Nov 13, 2021 1:18 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-రానా దగ్గుబాటి హీరోలుగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టైన ‘అయ్యప్పనుమ్ కోషియం’ చిత్రాన్ని సాగర్ కె చంద్ర “భీమ్లా నాయక్‌” పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగ వంశీ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన పవన్ కళ్యాణ్ టీజర్‌కు, టైటిల్ సాంగ్‌కు, రానా ఫ‌స్ట్ గ్లింప్స్‌కి, రెండో పాటకు, ‘లాలా భీమ్లా’ పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ రావడమే కాకుండా సినిమాపై అంచనాలు కూడా భారీగా పెరిగాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు రవి కె చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఎడిటింగ్ ఫుటేజీని పవన్ కళ్యాణ్ చూశాడు. ఆ తర్వాత ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రవి కె చంద్రన్‌పై ప్రశంసలు కురిపించాడు. మీ విజువల్ చాలా బ్రిలియన్స్‌గా ఉందని చెబూతూ ఈ మేరకు ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించాడు.

సంబంధిత సమాచారం :

More