ట్విట్టర్‌లో మైలురాయిని చేరుకున్న పవన్!

21st, November 2016 - 08:34:06 AM

pawan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ స్థాయి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అభిమానులంతా ఎంతో ఇష్టంగా పవన్ గురించిన విషయాలను తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తూంటారు. ఇక ఈ క్రమంలోనే తన రాజకీయపరమైన ఆలోచనలు, విధానాలను పంచుకునేందుకు 2014లో పవన్ కళ్యాణ్ ట్విట్టర్‌లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఆయనకు ట్విట్టర్‌లో ఫాలోవర్స్ సంఖ్య 1 మిలియన్ దాటింది. తెలుగులో అతితక్కువ మంది హీరోలు మాత్రమే 1 మిలియన్ (10 లక్షల) ఫాలోవర్స్ దాటిన వారిలో ఉన్నారు.

మిగతా హీరోల్లా పవన్ తన ట్విట్టర్ ఎకౌంట్‌లో సినిమాలకు సంబంధించిన విషయాలను అస్సలు పంచుకోరు. కేవలం తన పార్టీ అయిన జనసేన కార్యక్రమాల గురించి మాట్లాడడం, రాజకీయ ఆలోచనలు పంచుకోవడం, సమాజంలో జరిగే పలు సంఘటనలపై స్పందించడం మాత్రమే పవన్ ట్విట్టర్‌లో చేస్తూ వస్తున్నారు. ఇక పవన్‌కు 1 మిలియన్ ఫాలోవర్స్ వచ్చిన సందర్భంగా ఆయన అభిమానులంతా ట్విట్టర్‌లో సందడి చేస్తూ పవన్ పాత ట్వీట్స్ గురించి చర్చించుకుంటూ వస్తున్నారు.