‘ఉస్తాద్ భగత్ సింగ్’ పై పవన్ రివ్యూ – ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్

Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “ఉస్తాద్ భగత్ సింగ్”. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా సినిమా గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ఇప్పుడు జరిగింది. మేకర్స్ అంతా ఈ సినిమా రిజల్ట్ పట్ల నమ్మకంగానే ఉన్నారు. ఇక ఈ సినిమా రిజల్ట్ పై ఉస్తాద్ భగత్ సింగ్ పై డైరెక్ట్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నుంచే టాక్ బయటకి వచ్చేసింది.

తాను ఈ సినిమా చూశానని ఉస్తాద్ భగత్ సింగ్ తనకి మంచి ‘ఎంగేజింగ్, ఎంటర్టైనింగ్’ అంటూ కితాబిచ్చారు. ఏది ఏమైనప్పటికీ అంతిమంగా అది అభిమానులు, ప్రేక్షకులని మెప్పించాలని తాను తెలిపారు. దీనితో తన జడ్జిమెంట్ ఇప్పుడు బయటకి వచ్చి వైరల్ గా మారింది. సో ఇదే ఈ మార్చ్ 19న రిపీట్ అవుతుందా లేదా అనేది చూడాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్, థమన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.

Exit mobile version