నాని విషయంలో పవన్ రాక్ సాలిడ్ సపోర్ట్.!

Published on Sep 26, 2021 9:00 am IST

మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ చిత్రం “రిపబ్లిక్” ప్రీ రిలీజ్ వేడుకకి నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరైన సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ వేడుకలో పవన్ నుంచి ఈ స్థాయి అగ్రెసివ్ స్పీచ్ ని అయ్యితే అసలు ఎవరూ ఊహించి ఉండరు.

థియేటర్స్ ఓపెన్ అయ్యినా కూడా ఏపీలో టికెట్ రేట్లు సమస్యపై పవన్ మాట్లాడుతాడా లేదా అన్న ప్రశ్నకి అసలు ఎవరూ ఊహించని స్పందన ఇవ్వడంతో పవన్ కెరీర్ లోనే సినిమా పరంగా ఇది బెస్ట్ స్పీచ్ గా వైరల్ అవుతుంది. మరి ఈ ప్రధాన సమస్యకి ఇబ్బంది పడ్డ స్టార్ హీరోస్ లో నాచురల్ స్టార్ నాని కూడా ఒకరు.

తాను నటించిన లేటెస్ట్ సినిమా “టక్ జగదీష్” విషయంలో ఏం జరిగిందో తెలిసిందే.. ఒకానొక సమయంలో నాని తనని తానే వెలి వేసుకుంటానని చెప్పే వరకు రావడం నిజంగా అందరికీ బాధ కలిగించింది. మరి దీనిపైనే పవన్ స్పందిస్తూ తన రాక్ సాలిడ్ సపోర్ట్ వ్యక్తం చెయ్యడంతో నాని అభిమానులు సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనవుతున్నారు.

ఆ అబ్బాయి ఏం చేస్తాడు సమస్యలు ఇలా ఉంటే. అంతా అబ్బాయిని అంటున్నారు తన సినిమా ఓటిటికి వెళ్ళడానికి కారణమైన వాళ్ళని కదా అనాలి అని పవన్ తెలిపారు. దీనితో నాని అభిమానులు సహా సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత సమాచారం :