టాలీవుడ్ లో అపారమైన క్రేజ్ ఉన్న బిగ్గెస్ట్ మాస్ హీరోస్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ వేరు. మరి అదే క్రేజ్ లో ఇప్పుడు తన 52వ పుట్టినరోజు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో సందడి మొదలైంది. ఇక ఈ బర్త్ డే కానుకగా అయితే ఒకో సినిమా నుంచి అదిరే అప్డేట్ లు ఫిక్స్ కాగా పవన్ బర్త్ డే ని అయితే తన భారీ చిత్రం “హరిహర వీరమల్లు” చిత్ర యూనిట్ స్టార్ట్ చేశారు. మరి ఈ సినిమా నుంచి పవన్ తాలూకా సాలిడ్ లుక్ ని రివీల్ చేయడం వైరల్ గా మారింది.
మరి ఈ సినిమాలో పవన్ గడ్డం పెంచి కొన్ని సీక్వెన్స్ లు చేసిన విషయం తెలిసిందే. మరి దాని నుంచి జస్ట్ అలా నడిచి వచ్చే పోస్టర్ ని మేకర్స్ పవన్ బర్త్ డే కానుకగా రిలీజ్ చేసారు. మరి ఆ గడ్డం అందుకు తగ్గ కాస్ట్యూమ్ లో అయితే పవన్ సీరియస్ లుక్ లో నడిచే సింహపు ఠీవితో కనిపిస్తున్నాడు అని చెప్పాలి. దీనితో ఈ పోస్టర్ ఫ్యాన్స్ కి ఇప్పుడు మంచి ట్రీట్ ని అందిస్తుంది. ఇక ఈ చిత్రానికి విలక్షణ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా కీరవాణి సంగీతం అందించారు అలాగే ఏ ఎం రత్నం నిర్మాణం వహిస్తున్నారు.