ఇంటెన్స్ లుక్ లో “వీరమల్లు” గా పవర్ స్టార్ పవన్..కానీ.!

Published on Apr 10, 2022 4:00 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు”. పవన్ కెరీర్ లోనే ఎన్నో అంచనాలు నెలకొల్పుకొని మోస్ట్ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా మళ్ళీ చాలా కాలం అనంతరం షూటింగ్ రీస్టార్ట్ కాగా ఇలా కావడంతోనే మేకర్స్ అదిరే అప్డేట్స్ ని అందిస్తూ వస్తున్నారు.

అలా ఈరోజు శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా చిత్ర యూనిట్ రామ పూజా కార్యక్రమం చేసి ఒక ఇంట్రెస్టింగ్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మరి ఇందులో పవన్ మంచి ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడని చెప్పాలి. సాలిడ్ యాక్షన్ లో ఈ ఎపిసోడ్ ఉండేలా కనిపిస్తుంది.

కాకపోతే ఈ పోస్టర్ లో ఎడిటింగ్ వర్క్ మాత్రం అంత ఆకట్టుకునేలా లేదని చెప్పాలి. ఇవి ఇంకా బెటర్ గా నాచురల్ గా చెయ్యాల్సింది. అది మినహా ఈ పోస్టర్ మాత్రం ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ని ఇస్తుంది. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అలాగే మెగా సూర్య ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :