“వకీల్ సాబ్” దర్శకునికి గిఫ్ట్ పంపిన పవన్ కళ్యాణ్.!

Published on Dec 24, 2021 10:00 am IST


టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” తోనే మళ్ళీ తన సినిమా రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది అవ్వడానికి రీమేక్ సినిమా అయినా చాలా మార్పులు చేర్పులు చేసి దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ అభిమానులు నెక్స్ట్ లెవెల్ ట్రీట్ ని అందించాడు. దీనితో సినిమా రిలీజ్ అయ్యాక వేణు శ్రీరామ్ కి అభినందనల వెల్లువ వచ్చింది.

మరి ఇప్పుడు పవన్ ఈ క్రిస్మస్ కానుకగా తన దర్శకుడు వేణు శ్రీరామ్ దంపతులకి విషెష్ చెబుతూ గిఫ్ట్ పంపడం వైరల్ గా మారింది. దీనిని శ్రీరామ్ వేణు సతీమణి సోషల్ మీడియాలో వీడియో ద్వారా షేర్ చేసుకొని పవన్ పంపిన గ్రీటింగ్స్ బాక్స్ ని ఓపెన్ చేసి అందులో ఏమేం ఉన్నాయి చూపించి పవన్ మరియు అనా లకి ధన్యవాదాలు తెలిపారు. దీనితో ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

సంబంధిత సమాచారం :