మునికోటి కుటుంబానికి పవన్ ఆర్థిక సాయం

pawan-kal
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జీవితాన్ని సినిమాలతో పాటు రాజకీయ కార్యక్రమాలకు కూడా పూర్తిగా అంకిత చేసిన విషయం తెలిసిందే. ‘జనసేన’ పేరుతో ఓ పార్టీని స్థాపించిన ఆయన దాని తరపున ప్రభుత్వంపై పోరాడుతూనే వస్తున్నారు. అదేవిధంగా ఈ క్రమంలో తన దృష్టికి వచ్చిన కష్టాల్లో ఉన్న పలువురిని ఆదుకునే పవన్, ఈ ఉదయం మునికోటి అనే ఓ వ్యక్తి కుటుంబానికి అండగా నిలబడ్డారు. గతేడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటూ ఆత్మహత్య చేసుకున్న మునికోటి కుటుంబానికి పవన్ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.

సరిగ్గా మునికోటి చనిపోయి సంవత్సరం పూర్తైన రోజున పవన్ చెక్కును ఆ కుటుంబానికి అందజేశారు. ఇక పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు ఇలా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ఆయన అభిమానులకు ఆదర్శంగా నిలుస్తోంది. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ అనుచరులు తిరుపతికి చెందిన మునికోటి కుటుంబానికి సాయం అందేలా చేశారు.