రామ్ చరణ్ కు పవన్ కళ్యాణ్ ప్రత్యేక అభినందనలు

Published on Feb 26, 2023 2:20 am IST

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య నిర్మాతగా దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ మూవీ ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమురం భీంగా నటించిన ఈ మూవీలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించిన సంగతి తెలిసిందే. రిలీజ్ తరువాత ఎన్నో వందల కోట్ల కలెక్షన్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ అటు గ్లోబల్ గా కోట్ల ఆడియన్స్ యొక్క మనసు దోచుకుంది.

మరోవైపు ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ పలు అంతర్జాతీయ స్థాయి అవార్డులు సొంతం చేసుకుంటూ మన భారతీయ సినిమా ఖ్యాతిని మరింత విశ్వవ్యాప్తంగా చేస్తోంది. కాగా నేడు ఈమూవీ ప్రతిష్టాత్మక హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులని పలు క్యాటరిగిల్లో సొంతం చేసుకుంది. అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి బెస్ట్ వాయిస్ / మోషన్ క్యాప్చర్ పెర్ఫార్మన్స్ లో అవార్డు ప్రకటించడం, స్పాట్ లైట్ అవార్డుని స్వీకరించడం ఎంతో అభినందనీయం అని, అలానే దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మరియు ఆర్ఆర్ఆర్ టీమ్ మొత్తానికి హృదయపూర్వక అభినందనలు అంటూ పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత సమాచారం :