సినిమాలంటే వ్యామోహం లేదు.. వేరే హీరోలతో నాకు విభేదాల్లేవు : పవన్ కళ్యాణ్

pawan
పవన్ కళ్యాణ్ తిరుపతిలోని ఇందిరా మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు పెద్ద ఎత్తున అభిమానులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ బయటకు రాగానే అభిమానుల్లో ఒక్కసారిగా తోపులాట చోటుచేసుకుంది. అతి కష్టం మీద స్టేజ్ పైకి చేరుకున్న పవన్ చాలా ఉద్వేగంగా ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ‘నేను కోట్లు సంపాదిస్తాను, కోట్ల ట్యాక్స్ కడతాను. కానీ అవన్నీ నాకు సంతృప్తినివ్వవు. ప్రజాసేవే నాకు తృప్తినిస్తుంది’ అన్నారు.

అలాగే సినిమాలపై, రాజకీయాలపై, పదవులపై తనకు వ్యామోహం లేదని దేశం, సమాజం పై వ్యధ, వ్యామోహం, బాధ్యత ఉన్నాయని అన్నారు. అలాగే తన అభిమానాన్ని వినోద్ రాయ్ హత్య గురించి ప్రస్తావిస్తూ తనకు చాలా భాధగా ఉందని, వేరే హీరోలతో తనకు విభేదాల్లేవని, అందరూ ఒక్కటేనని చెప్పి తన లక్ష్యాలు, ఆశయాలు, భవిష్యత్ కార్యాచరణాలపై ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు.