ఇంటర్వ్యూ : శైలేష్ బొలిశెట్టి – పవన్ కళ్యాణ్ గారు నా కోసం ఓ 10 నిముషాలు కేటాయించారు !

sailesh-1

రేసింగ్ ఫీల్డ్ నుంచి సినిమాల్లోకి ఎంటరై ముకుందా సినిమాతో నటుడిగా పరిచయమైన శైలేష్ బొలిశెట్టి పూర్తి స్థాయి హీరోగా చేస్తున్న చిత్రం ‘చల్ చల్ గుర్రం’. రేపు 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానున్న సందర్బంగా ఈ చిత్రం గురించి శైలేష్ చెప్పిన విశేషాలు మీకోసం..

ప్ర) అసలు మీ బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?

జ) మాది జైజాగ్. నాన్న బిజినెస్ చేస్తుంటాడు. నేను మొదట కార్ రెసర్ ని. మూడుసార్లు నేషనల్ లెవల్ ఛాంపియన్ ని కూడా. అనుకోకుండా సినిమాల్లోకి వచ్చాను.

ప్ర) మీకు మొదటి అవకాశం ఎలా వచ్చింది ?

జ) నేను సత్యానంద్ గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు ఒకసారి అక్కడికొచ్చారు. అప్పుడే ముకుందా సినిమాలో పాత్ర గురించి చెప్పి కొత్త వాళ్ళ కోసం వెతుకుతున్నాను అన్నారు. వెంటనే సత్యానంద్ గారు నన్ను ప్రిఫర్ చేశారు. శ్రీకాంత్ అడ్డాల గారు కూడా వెంటనే తీసుకున్నారు.

ప్ర) ముకుందా తరువాత చాలా గ్యాప్ వచ్చింది ఎందుకు ?

జ) ఆ సినిమా తరువాత నేను నాన్నగారి బిజినెస్ టేకప్ చేశాను. అక్కడే కొన్నాళ్ళు గడిచిపోయాయి. అందుకే మరో సినిమా చేయడానికి ఇంత టైం పట్టింది. మళ్ళీ మధ్యలో రేసింగ్ కు కూడా వెళ్లాను.

ప్ర) మీకిష్టమైన రేసింగ్ ను ఇక వదిలేసినట్టేనా ?

జ) లేదు. రేసింగ్ ని వదిలేయలేదు. కానీ ఇంతకుమునుపు రేసింగ్, బిజినెస్, సినిమా అన్నీ ఒకేసారి చేసేటప్పటికి ఏదీ పర్ఫెక్ట్ గా చేయలేకపోయాను. దీంతో సమయం పూర్తిగా ఏదైనా ఒకదాని మీద కేటాయిద్దామని సినిమా ఎంచుకున్నాను.

ప్ర ) ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని కలిసినట్టున్నారు ఎందుకు ?

జ) మా ప్రొడ్యూసర్ రాఘవయ్య గారు జనసేన పార్టీ ట్రెజరర్. ఆయన పని మీద వెళ్లి కలిశాం. అక్కడ షూటింగ్ జరుగుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు నాకోసం పది నిముషాలు టైం కేటాయించి ట్రైలర్ చూసి, పాటలు విన్నారు చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

ప్ర) అసలు ఈ సినిమా కథేమిటి ?
జ) ఒక కుర్రాడు ఒకే బిల్డింగ్లో కింద, పైన ఉన్న ఫ్లోర్లలో ఒకేసారి జాబ్ చేస్తుంటాడు. అలా ఒకేసారి రెండు చోట్ల ఎలా జాబ్ చేశాడు. అసలేందుకు అలా చేశాడు అనేదే ఈ సినిమా కథ.

ప్ర) ఈ సినిమాలో ప్రధానమైన ప్లస్ పాయింట్స్ ఏంటి ?

జ) ప్లస్ పాయింట్స్ అంటే ఇందులో కామెడీ చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్ టైమింగ్ తో సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టదు. పాటలు కూడా చాలా బాగుంటాయి.

ప్ర) ఇకపై కూడా హీరోగానే చేస్తారా లేకపోతే వేరే పాత్రలు కూడా చేస్తారా ?
జ) ఒకటి రెండు నెగెటివ్ రోల్స్ వచ్చాయి. కానీ ఎవరికైనా హీరో గానే చెయ్యాలని ఉంటుంది కదా. నేనూ అంతే సపోర్టింగ్ రోల్స్ గురించి ఇంకా ఆలోచించలేదు.

ప్ర) ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ?

జ) ఫ్యూచర్ లో అటు సినిమాలు, ఇటు బిజినెస్, మధ్య మధ్యలో రేసింగ్ ఇలా మూడింటినీ బ్యాలెన్స్డ్ గా మైంటైన్ చేయాలని అనుకుంటున్నాను.